కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం! రైల్వేశాఖకు షాకిచ్చిన భక్తుడు!

Header Banner

కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం! రైల్వేశాఖకు షాకిచ్చిన భక్తుడు!

  Sat Feb 01, 2025 07:00        India

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు విదేశాల నుంచి సైతం అనేక మంది భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అందరిలాగే కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. ఈక్రమంలోనే రైలు టికెట్లు కూడా బుక్ చేశాడు. అన్నీ సర్దుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లగా.. రైలు ఎక్కలేకపోయాడు. అందుకు కారణం రైలు తలుపులు లోపలి నుంచి మూసి ఉండడమే. దీంతో వెనక్కి వచ్చి కుంభమేళాకు వెళ్లలేకపోయిన ప్రయాణికుడు భారతీయ రైల్వే శాఖపై ఫిర్యాదు చేశాడు. తన టికెట్ డబ్బులతో పాటు వాటికి వడ్డీ కట్టమని లేని పక్షంలో 50 లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

 

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన జనక్ కిషోర్ ఝా అందరిలాగే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను కూడా తన వెంట తీసుకెళ్లాలలనుకున్నాడు. ఈక్రమంలోనే ఏసీ 3 కోచ్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. జనవరి 26వ తేదీన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. చాలా సేపటి తర్వాత రైలు కూడా వచ్చి ఆగింది. ఈక్రమంలోనే లగేజీ తీసుకుని రైలు ఎక్కబోయాడు. 

 

ఇంకా చదవండిచంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కానీ తలుపులు ఎంతకూ తెరుచుకోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక రైల్వే అధికారులను సంప్రదించాడు. కానీ వారు కూడా పెద్దగా స్పందించలేదు. ఇలా జనక్ కిషోర్ ఝా, ఆయన కుటుంబ సభ్యులు రైలును మిస్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు. కానీ 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు వారి కుటుంబ సభ్యులు అంతా చాలా బాధ పడ్డారు. మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోవడంతో.. తమను కుంభమేళా వెళ్లకుండా చేసిన రైల్వే శాఖపై ఫిర్యాదు చేయాలనుకున్నాడు. 

 

ఈక్రమంలోనే 15 రోజుల్లోగా తన టిక్కెట్ డబ్బుల మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు చేయాల్సిందిగా భారతీయ రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను జనక్ కిషోర్ ఝా అధికారికంగా కోరారు. అదనంగా అతను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. నిర్ణీత గడువులో డబ్బులు రీఫండ్ చేయకపోతే రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!

 

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

 

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరంటాక్స్‌పేయర్లకు లాభామానష్టమా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Kumbhamela #Festivals